విజయకుమార్ కూతురు, నటి వనితను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • ఇంటిని ఆక్రమించుకుని ఖాళీ చేయని నటి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన విజయకుమార్
  • మధురవాయిల్ స్టేషన్ కు తరలింపు
బహుభాషా నటుడు విజయకుమార్, ఆయన కుమార్తె వనితకు మధ్య గతకొంత కాలంగా ఆస్తి వివాదాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు వనితను నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. విజయకుమార్‌కు చెన్నైలోని ఆలపాక్కం, అష్టలక్ష్మీ నగర్‌ 19వ వీధిలో పెద్ద బంగ్లా ఉంది. దీన్ని ఆయన సినిమా షూటింగ్ ల కోసం అద్దెకు ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఓ సినిమా కోసం భవనాన్ని అద్దెకు తీసుకున్న వనిత అందులో దిగిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా ఖాళీ చేసేందుకు నిరాకరించింది. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో విజయకుమార్ గతంలో మధురవాయిల్ పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు ఆ నివాసం వద్దకు చేరుకోగానే ఆమె వారితో వాగ్వాదానికి దిగింది. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయింది. అప్పట్లో వనిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆమెను అరెస్ట్ చేయరాదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం మళ్లీ తిరిగివచ్చింది. దీంతో విజయకుమార్ మరోసారి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు తాజాగా ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
Go Back to Shorts
Tamilnadu
kollywood
vijaykumar
vanitha
Police
case
arrest]

More Telugu News