ఈవీఎంను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్న బీజేపీ అభ్యర్థి... వీడియో వైరల్!
- పాలి నుంచి పోటీపడ్డ అభ్యర్థి ఇంట ఈవీఎం
- పోలింగ్ కేంద్రంలోని అదనపు ఈవీఎం అన్న ఈసీ
- నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరి సస్పెన్షన్
పాలి నియోజకవర్గంలో సెక్టార్ అధికారిగా ఉన్న ఓ వ్యక్తి పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను బీజేపీ అభ్యర్థి ఇంటికి తీసుకు వెళ్లినట్టు గుర్తించిన ఎన్నికల సంఘం అధికారులు, అతన్ని విధుల నుంచి తప్పించారు. స్థానిక రిటర్నింగ్ అధికారిపైనా సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఈవీఎం పోలింగ్ కేంద్రంలోని అదనపు ఈవీఎం అని ఈసీ వివరణ ఇచ్చింది.