సింహాచలం భైరవస్వామి ఆలయంలో తాంత్రికపూజలు.. అమావాస్య అర్ధరాత్రి పూజారుల నిర్వాకం!
- అడవివరం భైరవస్వామి ఆలయంలో పూజలు
- ఈవో ఆదేశాలతో నిర్వహించామన్న పూజారులు
- స్పందించేందుకు అందుబాటులోకి రాని ఈవో
అడవివరానికి 4 కి.మీ దూరంలో భైరవస్వామి ఆలయం ఉంది. ఈ స్వామికి కొందరు అర్చకులు అమావాస్య రోజున మద్యంతో అభిషేకం నిర్వహించడంతో పాటు ఇక్కడ పూజలు నిర్వహించారని భక్తులు తెలిపారు. ఇందుకోసం తమను ఆలయ సిబ్బంది అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. ఇదేమని ప్రశ్నిస్తే.. ఈవో ఆదేశాలతోనే తాము ఈ పూజలు నిర్వహిస్తున్నామనీ, మరికాసేపు ఆగాలని వారు సూచించారని భక్తులు వాపోయారు. కాగా, ఈ తాంత్రిక పూజల వ్యవహారంపై ఈవోను సంప్రదించేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.