2014లో తెలంగాణలో లగడపాటి సర్వే... చెప్పిందెంత? వాస్తవమేంటి?
- 2014లో టీఆర్ఎస్ కు 60 సీట్ల వరకూ రావచ్చన్న లగడపాటి
- 63 సీట్లు సాధించిన గులాబీ దళం
- టీడీపీ కూటమికి 18 నుంచి 22 సీట్లు వస్తాయని వెల్లడి
- 20 సీట్లు సాధించిన తెలుగుదేశం - బీజేపీ జట్టు
ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేయగా, 18 నుంచి 22 సీట్లు వస్తాయని లగడపాటి అంచనా వేయగా, 20 సీట్లు వచ్చాయి. టీఆర్ఎస్ కు 50 నుంచి 60 సీట్లు వస్తాయని ఆయన చెప్పగా, 63 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 30 నుంచి 40 సీట్లు వస్తాయని చెప్పగా, ఆ పార్టీ 20 సీట్లకే పరిమితమైంది. 7 నుంచి 9 చోట్ల ఇతరులు వస్తారని అంచనా వేయగా, 15 మంది గెలిచారు.
అంటే టీఆర్ఎస్, టీడీపీ విషయంలో ఆయన అంచనా ఫలించినట్టే. కాంగ్రెస్ విషయంలో మాత్రం ఓటర్ల నాడిని ఆయన టీమ్ అందుకోలేకపోయింది. మొత్తం మీద అంకెలు కాస్త అటూఇటుగా కనిపిస్తున్నా, ఆయన ఎగ్జిట్ పోల్ సర్వే నిజమైందనే చెప్పవచ్చు.