Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 67 శాతం పోలింగ్ నమోదైంది: రజత్ కుమార్

  • అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి
  • రీపోలింగ్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు
  • 13 సమస్యాత్మక ప్రాంతాల్లో 70 శాతం పోలింగ్ నమోదైంది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని, ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు 67 శాతం పోలింగ్ నమోదైందని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందని అన్నారు.

రాష్ట్రంలో రీపోలింగ్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, 13 సమస్యాత్మక ప్రాంతాల్లో డెబ్బై శాతం పోలింగ్ నమోదైందని, 2014 కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గిందని అన్నారు. 754 ఈవీఎంలను మార్చాల్సి వచ్చిందని, వాతావరణ పరిస్థితుల వల్ల 628 కంట్రోల్ యూనిట్స్ లోని వీవీ ప్యాట్స్ లో ఇబ్బందులు తలెత్తడంతో 1,444 వీవీ ప్యాట్స్ ను మార్చామని అన్నారు. 
Telangana
assembly elections
rajitkumar

More Telugu News