నితిన్ గడ్కరీకి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

  • అహ్మద్ నగర్ లో ఓ సభకు హాజరైన గడ్కరీ
  • వేదికపైనే సొమ్మసిల్లిన కేంద్ర మంత్రి
  • సభలో కలకలం
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఓ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వేదికపైనే ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. భద్రతా సిబ్బంది, అనుచరులు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
Go Back to Shorts
nitin gadkari
Maharashtra
ahmed nagar
ill

More Telugu News