మోత్కుపల్లి పరిస్థితి ఆందోళనకరం... హైదరాబాద్ కు తరలింపు!
- ఈ ఉదయం అస్వస్థతకు గురైన మోత్కుపల్లి
- ఛాతీలో నొప్పి, వాంతులతో ఇబ్బందులు
- అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో హైదరాబాద్ కు
- సుప్రజ ఆసుపత్రిలో చికిత్స
భువనగిరి ఏరియా ఆసుపత్రికి సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో, కుటుంబీకులు సొంత వాహనంలోనే ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. లో-బీపీతో పాటు ఛాతీలో విపరీతమైన నొప్పి, వాంతులు వచ్చాయని తెలుస్తోంది. దీంతో మోత్కుపల్లి అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.