వాహనదారులకు మద్రాస్ హైకోర్టు శుభవార్త!
- లైసెన్స్, ఇతర ధ్రువపత్రాల ఎలక్ట్రానిక్ కాపీలు ఉన్నా ఓకే
- ఒరిజినల్స్ వెంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు
- వాహనదారులకు అనుకూలంగా తీర్పు
లైసెన్స్ సహా వాహనానికి సంబంధించిన ఇతర ధ్రువపత్రాలను డ్రైవర్లు వెంట ఉంచుకోవాలంటూ తమిళనాడు రాష్ట్ర ప్లానింగ్ సెల్ గతేడాది మెమొరాండం జారీ చేసింది. మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 130, సెక్షన్ 171 ప్రకారం ఒరిజినల్స్‌ను వెంట ఉంచుకోవడం తప్పనిసరి అని పేర్కొంది.
అయితే, దీనిని వివిధ ట్రాన్స్పోర్ట్ బాడీలు తప్పుబట్టి ప్రభుత్వ ఆదేశాలను కోర్టులో సవాలు చేశాయి. తాజాగా, వీటిని విచారించిన జస్టిస్ డాక్టర్ వినీత్ కొఠారి, జస్టిస్ డాక్టర్ అనిత సుమంత్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. ఒరిజినల్స్‌ను వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేదని, ఎలక్ట్రానిక్ కాపీలు ఉన్నా సరిపోతుందంటూ వాహనదారులకు అనుకూలంగా తీర్పు చెప్పింది.