పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ
- నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపురంలో ఘటన
- కేంద్రం వద్ద ఓటర్లను అభ్యర్థించే క్రమంలో ఘర్షణ
- ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
తెల్లారేసరికే ఇరువర్గాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పరిస్థితిని గమనించిన సమీపంలోని పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పంపించి వేశారు.