గూగుల్ నుంచి రిలయన్స్ జియోకు గట్టి దెబ్బ!
- జియోకి దీటుగా ‘విజ్ఫోన్ డబ్ల్యూపీ006’
- రూ.500కే ఫీచర్ ఫోన్
- ఇండోనేషియాలో ఆవిష్కరించిన గూగుల్
- జియో మాదిరిగానే అన్ని ఫీచర్స్
భారత్ కరెన్సీలో దీని విలువ రూ.500. జియో ఫోన్ మాదిరిగానే ఇది కూడా ‘కై ఓఎస్’తోనే పనిచేస్తుంది. ఈ ఫోన్ 4జీకి కూడా సపోర్ట్ చేస్తుంది. జియో ఫోన్లో ఉన్నట్టే దీనిలోనూ అన్ని ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్ వంటి యాప్స్ కూడా ఈ ఫోనులో ఉంటాయి. క్వాల్కామ్ ఎంఎస్ఎం 8905 చిప్సెట్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటివి ఉన్నాయి.