ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్... పీకల్లోతు కష్టాల్లో భారత్!

  • అడిలైడ్ లో ప్రారంభమైన తొలి టెస్టు
  • లంచ్ సమయానికి 4 వికెట్లు కోల్పోయిన భారత్
  • ప్రస్తుతం స్కోరు 27 ఓవర్లలో 56/4
అడిలైడ్‌ మైదానంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఆది నుంచే వరుసగా వికెట్లను చేజార్చుకుంది. లంచ్ సమయానికి 27 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది.

టాప్ ఆర్డర్ లో ఎవరూ పట్టుమని 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఓపెనర్లు లోకేష్‌ రాహుల్‌ 2, మురళీ విజయ్‌ 11 పరుగులకే అవుట్ కాగా, విరాట్‌ కోహ్లీ 3, అజింక్యా రహానె 13 పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ కు చేరారు. ప్రస్తుతం క్రీజులో చటేశ్వర పుజారా (11), రోహిత్‌ శర్మ(15) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజెల్ వుడ్ 2 వికెట్లు పడగొట్టగా, స్టార్క్, కుమిన్స్ కు చెరో వికెట్ లభించాయి.
Go Back to Shorts
Adilide
Australia
India
Cricket

More Telugu News