మూఢనమ్మకంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లలేదు!: సీఎం కేసీఆర్
- బీజేపీ, కాంగ్రెస్ లు పనికిమాలిన పార్టీలు
- జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తాం
- ఫెడరల్ ఫ్రంట్ కింద దేశాన్ని ఏకం చేస్తాం
దేశంలోని ప్రజలను ఫెడరల్ ఫ్రంట్ కింద ఏకం చేస్తామని గులాబీ బాస్ ప్రకటించారు. తాను ప్రధాని నరేంద్ర మోదీకి బీ టీమ్ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించడంపై కేసీఆర్ మండిపడ్డారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ అనే రెండు పనికిమాలిన పార్టీలు ఉన్నాయని దుయ్యబట్టారు. తెలంగాణకు వచ్చే మోదీ తాను కాంగ్రెస్ చెంచా అనీ, సోనియాగాంధీ తాను బీజేపీకి చెంచా అంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతీ పార్టీతో కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు. తమ ఉద్యమంలో న్యాయాన్ని గుర్తించి దేశవ్యాప్తంగా 42 పార్టీలు ప్రత్యేక తెలంగాణకు మద్దతు ప్రకటించాయన్నారు.