నేను పోరాటయోధుడిని.. ముష్టివాడిని కాదు!: ముఖ్యమంత్రి కేసీఆర్
- కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయం ఏర్పాటుచేస్తాం
- తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తా
- ఆ తర్వాత దేశమంతా పర్యటిస్తాను
ఈసారి తెలంగాణలో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఓసారి తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం దేశమంతా పర్యటిస్తానని తెలిపారు. తాను పోరాటయోధుడిననీ, ముష్టివాడిని కాదని వ్యాఖ్యానించారు. తాను పోరాడటంతోనే అసాధ్యం అనుకున్న తెలంగాణ సుసాధ్యం అయిందనీ, అలాగే ఫెడరల్ ఫ్రంట్ సైతం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.