Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓలా డ్రైవర్‌ను దోచుకున్న దుండగులు.. భార్యకు వీడియో కాల్ చేయించి నగ్నంగా మార్చి స్క్రీన్‌షాట్లు!

  • ప్రయాణికుల ముసుగులో క్యాబ్ బుక్ చేసుకున్న దుండగులు
  • డ్రైవర్‌ను కొట్టి డబ్బులు దోచుకున్న వైనం
  • చాకచక్యంగా తప్పించుకున్న డ్రైవర్
  • నిందితుల కోసం పోలీసుల వేట
బెంగళూరులో దారుణాతి దారుణం జరిగింది. ప్రయాణికుల్లా ఓలా క్యాబ్ బుక్ చేసుకున్న నలుగురు దుండగులు డ్రైవర్‌ను దోచుకోవడమే కాకుండా, అతడి భార్యకు వీడియో కాల్ చేయించి నగ్నంగా మార్చారు. ఆ దృశ్యాలను స్క్రీన్ షాట్లు తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో సోమశేఖర్ ఓలా క్యాబ్‌ను నలుగురు వ్యక్తులు బెంగళూరులోని అడుగోడి నుంచి దొమ్మసంద్ర వెళ్లేందుకు బుక్ చేసుకున్నారు. కారు ఎక్కిన కాసేపటికి డ్రైవర్‌ను కొట్టి అతడి వద్ద ఉన్న డబ్బులను దోచుకున్నారు. అనంతరం అతడి భార్యకు వీడియో కాల్ చేసి బెదిరించి దుస్తులు విప్పించి స్క్రీన్ షాట్లు తీసుకున్నారు.

దొమ్మసంద్రకు మరికాసేపట్లో చేరుకుంటామనగా ఈ ఘటన జరిగిందని బాధిత డ్రైవర్ సోమశేఖర్ తెలిపాడు.  తన కారు తాళాలు తీసుకుని వారే నడిపారని, దాదాపు వంద కిలోమీటర్లు తిప్పారని పేర్కొన్నాడు. తన వద్ద ఉన్న రూ. 9 వేలను లాక్కున్నారని, అక్కడితో ఆగక స్నేహితులకు ఫోన్ చేయించి డబ్బులు అడగాలని కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

పేటీఎం ద్వారా స్నేహితులు పంపిన రూ. 20 వేలను వారు తమ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారని తెలిపాడు. కారును మధ్యలో ఆపి ఆ డబ్బులను డ్రా చేసుకున్నారని తెలిపాడు. అంతేకాక, తన భార్యకు వీడియో కాల్ చేయించి బలవంతంగా దుస్తులు విప్పించారని, ఆ దృశ్యాన్ని స్క్రీన్ షాట్లు తీసుకున్నారని సోమశేఖర్ కన్నీరు పెట్టుకున్నాడు.

అనంతరం రామనగర జిల్లా చెన్నపట్టణలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లారని తెలిపాడు. శనివారం తెల్లవారుజామున టాయిలెట్‌కు వెళ్తున్నట్టు చెప్పి టాయిలెట్ విండో నుంచి దూకి బయటపడ్డానని వివరించాడు.  అనంతరం చెన్నపట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సోమశేఖర్ జరిగిన దారుణాన్ని వివరించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లాడ్జీకి వెళ్లే సరికే దుండగులు పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Ola
Driver
Robbed
Video Call
Bengaluru
Somashekhar
Police

More Telugu News