నా ఓటు 'నోటా'కే అంటూ హైదరాబాదులో భారీ ప్రచారం
- తమ బాధలను అర్థం చేసుకోలేని పార్టీలపై క్యాబ్ డ్రైవర్ల ఆగ్రహం
- నోటాకే ఓటు వేయాలంటూ క్యాబ్ లపై పోస్టర్లు
- ప్రజలకు మేలు చేయని పార్టీలకు ఓటు వేయవద్దంటూ విన్నపం
వోలా, ఉబెర్ యాజమాన్యాల మోసాల నుంచి తమను కాపాడాలని పార్టీల నేతల వద్ద మొరపెట్టుకున్నా... ఏ ఒక్కరూ స్పందించలేదని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సలావుద్దీన్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలకు మేలు చేయని పార్టీలకు ఓటు వేయవద్దని... నోటాకు ఓటు వేయాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. హైదరాబాదు రోడ్లపై వందల సంఖ్యలో క్యాబ్ లు తిరుగుతున్న నేపథ్యంలో, వీరి ప్రచారం జనాలకు చేరువవుతోంది.