అవకాశం ఇస్తా... నాకేంటి అన్నాడు: పాయల్ రాజ్ పుత్

  • టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉంది
  • నటిగా నిరూపించుకున్న తరువాత కూడా వేధింపులు
  • అతని చెంపలు వాయించాలని అనిపించింది
  • 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్ పుత్
తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని, అది తననూ తాకిందని 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటి పాయల్ రాజ్ పుత్ వ్యాఖ్యానించింది. తాజాగా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, నటిగా నిరూపించుకున్న తరువాత కూడా తనకు వేధింపులు ఎదురుకావడం బాధ కలిగించిందని అంది.

'ఆర్ఎక్స్ 100' విజయవంతమైన తరువాత ఓ వ్యక్తి తనను కలిశాడని, సినిమాలో అవకాశం ఇస్తానని, తనకేమిస్తావని అడిగాడని చెప్పింది. అతని చెంపలు వాయించాలని అనిపించినా, ఎంతో కష్టం మీద కంట్రోల్ చేసుకున్నానని చెప్పింది. తనకు టాలెంట్ ఉంది కాబట్టి అవకాశాలు వచ్చాయే తప్ప, ముద్దు సీన్లలో నటించినందుకు కాదని గట్టిగా చెప్పి వచ్చేశానని అంది. తనకు కథ చెప్పి కన్విన్స్ చేయగలిగితే ఎటువంటి పాత్రనైనా చేసేందుకు సిద్ధమేనని పాయల్ వ్యాఖ్యానించింది. తాను ప్రొఫెషనల్ గా ఆలోచిస్తానని, తాజాగా ఓ చిత్రంలో ఐటెమ్ సాంగ్ ముందు వచ్చే సన్నివేశం నచ్చి, ఆ పాటలో డ్యాన్స్ చేసేందుకు అంగీకరించానని తెలిపింది.
Go Back to Shorts
Tollywood
Casting Couch
Payal Rajput

More Telugu News