నేవీ కమాండర్ నిర్వాకం.. పోర్న్ యాప్ లో భార్య ఫొటోలనే అప్ లోడ్ చేసిన వైనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేవీ కమాండర్ నిర్వాకం.. పోర్న్ యాప్ లో భార్య ఫొటోలనే అప్ లోడ్ చేసిన వైనం!

  • పోర్నోగ్రఫీకి అలవాటు పడిన భర్త 
  • ఫోన్‌లో భార్య అభ్యంతరకర ఫోటోలు 
  • పోలీసులకు ఫిర్యాదు
భర్త స్మార్ట్ ఫోనును చూసిన భార్యకు షాకింగ్ నిజాలు తెలిశాయి. తను, తనతో పాటు మరో మహిళ ఉన్న అభ్యంతరకర ఫోటోలు కనిపించడంతో షాక్‌కు గురైంది. అంతే కాకుండా అవి పోర్న్‌కు సంబంధించిన యాప్‌లో అప్‌లోడ్ చేసి ఉండటంతో మరింత నిర్ఘాంతపోయింది. ఢిల్లీలో నేవీ కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న 39 ఏళ్ల అధికారి పోర్నోగ్రఫీకి అలవాటు పడ్డాడు. గతంలో ఆర్మీలో ఆఫీసర్ గా పనిచేసిన ఆయన భార్య.. భర్తకు ఎన్నోసార్లు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఎంతకీ మార్పు రాకపోవడంతో పిల్లలతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది.

అయినా అతడిలో మార్పు రాకపోవడంతో గత నెలలో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఢిల్లీ నుంచి ఆమె వస్తూ వస్తూ భర్త సెల్‌ఫోన్‌ను తీసుకొచ్చేసింది. ఆ ఫోన్‌ను పరిశీలించగా తన అభ్యంతరక ఫోటోలను చూసి షాక్ అయ్యింది. వెంటనే పుణె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తకు కొలీగ్ భార్యతో వివాహేతర సంబంధం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. తన అభ్యంతరకర ఫోటోలతో పాటు, కొలీగ్ భార్య, మరికొందరి ఫోటోలను యాప్‌లో అప్‌లోడ్ చేశాడని ఫిర్యాదులో ఆమె వెల్లడించింది. నేవీ కమాండర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాయనున్నట్టు వెల్లడించారు.
Pornography
Navy commander
Delhi
Pune

More Telugu News