చార్మినార్ ను నేను కట్టలేదు.. కేసీఆర్ కట్టాడో లేదో నాకు తెలీదు: చంద్రబాబు సెటైర్లు

  • కేసీఆరే మొత్తం కట్టానని అనుకుంటున్నాడు
  • గర్వంగా చెబుతున్నా, సైబరాబాద్ నిర్మించింది నేనే
  • ఇది నా మానసపుత్రిక
నాడు హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని చెబుతున్న సీఎం చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఈ వ్యంగ్యాస్త్రాలపై చంద్రబాబు తిరిగి సెటైర్లు విసిరారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోని నిజాంపేటలో ఈరోజు నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ‘నేను చార్మినార్ కట్టలేదు. కేసీఆర్ కట్టాడో లేదో నాకు తెలియదు!’ అంటూ నవ్వులు చిందించారు. దీంతో, చంద్రబాబు ప్రసంగం వినేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు కూడా కరతాళ ధ్వనులు, నవ్వుల ద్వారా ప్రతిస్పందించారు.

‘ఆయనే (కేసీఆర్) మొత్తం కట్టానని అనుకుంటున్నాడు. గర్వంగా చెబుతున్నా, సైబరాబాద్ నగరాన్ని నేనే నిర్మాణం చేశాను. ఇది నా మానసపుత్రిక. నా బ్రెయిన్ చైల్డ్’ అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Chandrababu
kcr
charminar
nizampet

More Telugu News