నాకన్నా బాగా చేస్తున్నావ్ అని ప్రభాస్ మెచ్చుకున్నారు: 'బాహుబలి' చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ
- 'బాహూబలి'లో కొండెక్కే సీన్ అది
- రాజమౌళి గారు ధైర్యం చెప్పారు
- అప్పుడు ప్రభాస్ అక్కడే వున్నారు
కొంత దూరం కొండ ఎక్కేశాక భయమేసింది .. 'అక్కడి నుంచి జారిపో' అని రాజమౌళి గారు చెప్పడంతో అలాగే చేశాను. అదృష్టం కొద్దీ నాకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు. ప్రభాస్ గారు సెట్లో నన్ను డాళింగ్ .. డాళింగ్ అని పిలిచే వారు. నేను కొండెక్కేటప్పుడు ఆయన కిందనే వున్నారు. నేను కొండ దిగిన తరువాత, 'నీకు చాలా ధైర్యం ఎక్కువ డాళింగ్ .. నాకన్నా బాగా చేస్తున్నావ్' అంటూ మెచ్చుకున్నారు' అని చెప్పుకొచ్చాడు.