కూకట్ పల్లిలో చంద్రబాబు రోడ్ షోకు అనుమతి నిరాకరించిన పోలీసులు

  • రేపు కేటీఆర్ రోడ్ షో
  • చంద్రబాబుకు అనుమతి నిరాకరణ
  • సుహాసినికి మద్దతుగా ప్రచారం
ఒకే రోజు రెండు పార్టీలకు అనుమతి ఇవ్వలేమంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కూకట్‌పల్లిలో మహాకూటమి నుంచి బరిలోకి దిగిన తన మేనకోడలు నందమూరి సుహాసినికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు భావించారు. కానీ రేపు కేటీఆర్ రోడ్ షో ఉండటంతో కూకట్‌పల్లి పోలీసులు చంద్రబాబు ప్రచారానికి అనుమతి నిరాకరించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోకు అనుమతి ఇచ్చామని.. ఒకే రోజు మరో పార్టీకి అనుమతినివ్వలేమని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
KTR
Road Show
Suhasini
Kukatpally

More Telugu News