మందు కొట్టి కారు నడుపుతూ అడ్డంగా బుక్కయిన నటి గాయత్రీ రఘురాం!
- చెన్నైలో సినీ ప్రముఖుల పార్టీ
- పార్టీలో పూటుగా మందు కొట్టిన గాయత్రి
- కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు
అదే సమయంలో అటుగా వచ్చిన గాయత్రి కారును ఆపి, బ్రీత్ అనలైజర్ లోకి గాలిని ఊదాలని కోరగా, ఆమె తాను ఆల్కహాల్ తీసుకున్నట్టు అంగీకరించింది. ఆపై పోలీసులు ఆమెకు తనిఖీలు చేసి, మోతాదుకు మించి మద్యం తీసుకున్నట్టు తేల్చి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె బీఏసీ 185 రావడం గమనార్హం.
గాయత్రీ రఘురాంను కారులో చూడటంతో ఆ ప్రాంతమంతా ప్రజలు, అభిమానులతో నిండిపోయింది. చుట్టూ హడావుడి పెరుగుతూ ఉండటంతో, ఆమెను ఇంటివరకూ దింపాలని నిర్ణయించుకున్నామని, ఆపై ఆమె వాహనం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఏదైనా మొబైల్ కోర్టులో ఆమె రూ. 3,500 జరిమానా చెల్లించి డాక్యుమెంట్లు తీసుకోవచ్చని అన్నారు.