చిరూ చిన్నల్లుడి మూవీ కోసం ప్రియా వారియర్ ను అడిగారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరూ చిన్నల్లుడి మూవీ కోసం ప్రియా వారియర్ ను అడిగారట!

  • ప్రియా వారియర్ కి యూత్ లో క్రేజ్ 
  • వివిధ భాషల నుంచి వస్తోన్న అవకాశాలు 
  • చిన్న సినిమాలు చేసే ఉద్దేశంతో లేని ప్రియ   
'ఒరు ఆదార్ లవ్' అనే మలయాళ సినిమాలోని ఒక పాటలో కన్నుగీటేసిన ప్రియా వారియర్, కుర్రకారు మతులు పోగెట్టేసింది. ఈ ఒక్క పాటతోనే ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. దాంతో వివిధ భాషల నుంచి ఆమెను సంప్రదిస్తోన్న దర్శక నిర్మాతల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో చిరూ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సినిమా కోసం కూడా ప్రియా వారియర్ ను అడిగారట.

పులి వాసు దర్శకుడిగా కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం ప్రియా వారియర్ ను అడిగితే, పారితోషికంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. స్టార్ హీరోలతో మాత్రమే చేయాలనే ఉద్దేశంతో ప్రియా వారియర్ ఉందట. అందువల్లనే కొత్తగా వస్తోన్న హీరోల సరసన చేయనని చెప్పకుండా, పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.       
kalyan dev

More Telugu News