గాయని పసల బేబీని ఇంటికి పిలిపించుకుని అభినందించిన మెగాస్టార్.. ఆమె టాలెంట్‌కు చిరు ఫిదా
- బేబీ పాటకు ప్రముఖులు ఫిదా
- ఫ్యాన్‌గా మారిపోయిన చిరంజీవి భార్య సురేఖ
- ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన మెగాస్టార్
ఇటీవల ఆమె పాటను విన్న మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కూడా బేబీకి ప్యాన్గా మారిపోయారు. ఆమెను చూడాలని, ఆమె పాటను వినాలన్న కోరికను చిరంజీవి వద్ద వ్యక్తపరిచారు. దీంతో ఆమె గురించి వాకబు చేసిన చిరంజీవి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సహకారంతో ఆదివారం ఆమెను ఇంటికి పిలిపించుకున్నారు. చిరంజీవి అంతటి వ్యక్తి తన ఇంటికి పిలిపించుకోవడంతో బేబీ ఆనందాన్ని పట్టలేక ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ సందర్బంగా కొన్ని పాటలు పాడిన ఆమె చిరూ ఫ్యామిలీని మెస్మరైజ్ చేసింది. తనకు ఈ అవకాశం కల్పించిన కోటికి ధన్యవాదాలు తెలిపింది.