ఉదయం టీఆర్ఎస్ తీర్థం.. మధ్యాహ్నం కాంగ్రెస్ కండువా.. గంట వ్యవధిలో రెండు పార్టీలు!
- పార్టీలో చేరిన గంటకే తిరిగి సొంతగూటికి
- రెండు కండువాలతో ఉన్న ఫొటో వైరల్
- మహేశ్వరంలో ఘటన
విషయం తెలిసిన మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి వెంటనే భాస్కర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పార్టీ ఎందుకు మారారని ప్రశ్నించారు. అయితే, కృష్ణారెడ్డి అంతటి వ్యక్తి వచ్చి కండువా కప్పుతుంటే ఏమీ అనలేకపోయానని చెప్పారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వ్యక్తినేనని, టీఆర్ఎస్లో చేరేది లేదని స్పష్టం చేసి సబిత చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్లో చేరిన గంటకే తిరిగి కాంగ్రెస్ చేరడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తీగల కృష్ణారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో భాస్కర్ రెడ్డి ఉన్న ఫొటోలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి.