హెలికాప్టర్ నుంచి దిగబోతూ.. కిందపడ్డ అమిత్ షా
- గురువారం చోటుచేసుకున్న ఘటన
- మిజోరాం ఎన్నికల ప్రచారంలో ప్రమాదం
- 28న మిజోరాం అసెంబ్లీకి ఎన్నికలు
హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత దిగబోయిన ఆయన పొరపాటున అడుగు తప్పుగా వేయడంతో నేలపై పడ్డారు. వెంటనే హెలికాప్టర్ లో ఆయనతో పాటే వెళ్లిన మరో వ్యక్తి ఆయనను పైకి లేపారు. దుస్తులకు అంటుకున్న దుమ్మును దులిపారు. ఘటన నుంచి తేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి తన కార్యక్రమానికి బయలుదేరారు. మిజోరాంలో ఈనెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోను ఎవరో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో... ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.