సింహాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఆత్మహత్య.. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, ఉద్యోగులు!
- డిపోలో విషం తాగిన చింతా నాగేశ్వరరావు
- డీఎం దివ్య వేధిస్తున్నారని సూసైడ్ నోట్
- మృతుడి కుమారుడికి ఉద్యోగం ఇస్తామని హామీ
డిపో నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రీజినల్ మేనేజర్ బాధిత కుటుంబంతో పాటు ఆర్టీసీ కార్మికులతో చర్చలు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాగేశ్వరరావు 1991 నుంచి ఇక్కడ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని తెలిపారు. నాగేశ్వరరావు మరణం నేపథ్యంలో ఆయన కుమారుడికి తొలుత ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగం ఇస్తామని అన్నారు.
అనంతరం ఆ యువకుడి సర్వీసును క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే నాగేశ్వరరావు కుటుంబానికి పరిహారం చెల్లింపు తన పరిధిలో లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ హామీలను లిఖిత పూర్వకంగా ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు.