జామా మసీదును కూలగొట్టండి.. ఆలయ అవశేషాలు దొరక్కుంటే నన్ను ఉరితీయండి!: సాక్షి మహరాజ్
- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత
- మసీదు కింద ఆలయం అవశేషాలు ఉన్నట్లు వెల్లడి
- మొఘలులు 3వేల ఆలయాలు కూలగొట్టారని వ్యాఖ్య
మొఘల్ పాలకులు దేశవ్యాప్తంగా 3,000 ఆలయాలు కూల్చివేసి మసీదులను నిర్మించారని ఆయన తెలిపారు. జామా మసీదు కింద హిందూ ఆలయ ఆనవాళ్లు బయటపడతాయనీ, ఒకవేళ దొరకకుంటే తనను ఉరితీయాలని సవాల్ విసిరారు. సాక్షి మహరాజ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. హిందూ మహిళలు ఎక్కువ మంది పిల్లలను కని మతాన్ని కాపాడాలనీ, మూకదాడుల్లో ముస్లింలను చంపడం సరైనదేనంటూ గతంలో వ్యాఖ్యానించి ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు.