సోనియా, రాహుల్ సభకు ఎస్పీజీ సెక్యూరిటీ ఆంక్షలు!
- నేడు మేడ్చల్ లో భారీ సభ
- పరిమిత సంఖ్యలోనే వేదికపై నేతలు
- స్థానిక పోలీసులకు ఎస్పీజీ ఆదేశాలు!
వేదికపై మొత్తం 119 మంది మహాకూటమి అభ్యర్థులను, ఇతర నేతలను, స్టార్ క్యాంపెయినర్లను కూర్చోబెట్టేలా మొత్తం 220 మందికి వేదికను సిద్ధం చేయగా, 60 నుంచి 75 మందిని మాత్రమే అనుమతిస్తామని, వారి జాబితాను కూడా ముందుగానే అందించాలని ఎస్పీజీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రతి ఒక్కరినీ తనిఖీల అనంతరమే వేదికపైకి అనుమతించాలని, ప్రజల వద్దకు వీవీఐపీలు వెళ్లకుండా చూడాలని కూడా పోలీసులకు ఆదేశాలు అందాయి. పోటీలో నిలిచే అభ్యర్థుల కోసం మరో వేదికను సిద్ధం చేసుకోవాలని సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న నేతలకు పోలీసుల నుంచి సూచనలు వెళ్లాయి.