ఒట్టు పెట్టుకున్న ప్రజలు... చంద్రబాబు గతి ఇంతే: విజయసాయిరెడ్డి

  • నోరు విప్పితే అబద్ధాలు చెప్పే చంద్రబాబు
  • 2014లో దొంగ హామీలను నమ్మిన ప్రజలు
  • 2019లో బంగాళాఖాతంలో విసిరేయడం ఖాయం
  • ఫేస్ బుక్ లో విజయసాయి విమర్శలు
ఏపీ సీఎం చంద్రబాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో మారు టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, చంద్రబాబును బంగాళాఖాతంలో కలపాలని ప్రజలు ఒట్టు పెట్టుకున్నారని అన్నారు. "దొంగ హామీలు, నోరు విప్పితే అబద్దాలు... ఈ కళలో చంద్రబాబు మాస్టర్‌. 2014లో బాబు చేసిన దొంగ వాగ్దానాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు నమ్మారు. అలాగే 2019 ఎన్నికలలో బాబును బంగాళాఖాతంలో విసిరేయాలని కూడా ఒట్టేసుకున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Vijayasaireddy
Chandrababu
Facebook

More Telugu News