‘కోడికత్తి’ నిందితుడు శ్రీనివాసరావుకు నేటితో ముగియనున్న రిమాండ్
- గత నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి
- శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
- రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించే అవకాశం
గత నెల 25న విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ కేసు విషయంలో వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా పోలీసులు పలుమార్లు జగన్‌ను కోరినప్పటికీ ఆయన ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో తాజాగా మరోమారు జగన్‌కు పోలీసులు నోటీసులు పంపించారు. కేసు పురోభివృద్ధి కోసం వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరారు.