Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎక్కడికి ఈ పరుగు' నుంచి స్పెషల్ పోస్టర్

  • ప్రధాన పాత్రల్లో ఆర్యన్ రాజేశ్ .. శశాంక్ 
  • స్పెషల్ పోస్టర్ వదిలిన అల్లరి నరేశ్ 
  • త్వరలో పూర్తి వివరాలు
ఆర్యన్ రాజేశ్ .. శశాంక్ కలిసి 'ఎక్కడికి ఈ పరుగు' సినిమాలో ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ రాగ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి అభిలాష్ రెడ్డి దర్శకుడు. ఈ రోజున శశాంక్ పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ,  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అల్లరి నరేశ్ తన ట్విట్టర్ ద్వారా ఈ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు.

పోస్టర్ ఆసక్తిని రేకెత్తించేదిగానే వుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి వుంది. శశాంక్ కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను చేస్తుండగా, కొంత గ్యాప్ తరువాత ఆర్యన్ రాజేశ్ 'వినయ విధేయ రామ' సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. చూస్తుంటే ఆర్యన్ రాజేశ్ స్పీడ్ పెంచుతున్నట్టే కనిపిస్తోంది.
aaryan rajesh
shashank

More Telugu News