Ivanka Trump: స్నేహితుని వివాహం కోసం ఇండియాకు వస్తున్న ఇవాంకా ట్రంప్!

రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జరగనున్న ఓ హైప్రొఫైల్ వివాహానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, తన భర్త జరేడ్ కుష్నర్ తో కలసి వస్తున్నారట.  దీంతో రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. యూఎస్ ఎంబసీకి చెందిన దాదాపు 50 మంది జైసల్మేర్ కు వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.

నేటి నుంచి మూడు రోజుల పాటు తన స్నేహితుడైన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంట వివాహ వేడుక ఉండగా, ప్రత్యేక విమానంలో ఇవాంకా దంపతులు వస్తున్నట్టు సమాచారం అందిందని జైసల్మేర్ ఎస్పీ రాజీవ్ దుత్తా వెల్లడించారు. వీరు నగరంలోనే బస చేస్తారని, ఇండియాలోని మరే ఇతర ప్రాంతాన్నీ సందర్శించే షెడ్యూల్ లేదని తెలుస్తోంది. వివాహం అనంతరం వీరిద్దరూ 25వ తేదీన తిరిగి యూఎస్ బయలుదేరి వెళతారని దుత్తా తెలిపారు.
Ivanka Trump
Marriage
Rajasthan
USA

More Telugu News