టీఆర్ఎస్ ను వీడుతున్న మరో ముగ్గురు ఎంపీలు వీరేనంటూ ప్రచారం!
- ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు షాక్
- ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పిన కొండా
- జాబితాలో జితేందర్, పటేల్, పొంగులేటి ఉన్నారంటూ ప్రచారం
ఇద్దరు ఎంపీలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఐదు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపాయి. తాను పార్టీ మారబోవడం లేదని మీడియా ముఖంగా కొండా చెప్పినప్పటికీ... చివరకు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో, కొండా దారిలోనే మరో ముగ్గురు ఎంపీలు కూడా టీఆర్ఎస్ ను వీడటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.