విమానం ఎక్కేందుకు రన్ వే పై యువతి పరుగులు.. కష్టపడి అడ్డుకున్న అధికారులు!
- ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఘటన
- ఆలస్యంగా వచ్చి విమానం మిస్ అయిన యువతి
- మరో విమానంలో పంపిన ఎయిర్ పోర్టు అధికారులు
ఈ ఘటన ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఉన్న నుగురాహ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. సిటీలింక్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం బాలీ నుంచి జకార్తాకు బయలుదేరింది. అయితే నిర్ణీత సమయంలోగా ఓ యువతి బోర్డింగ్ వద్దకు చేరుకోలేకపోయింది. దీంతో విమానం రన్ వే పైకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి లోనైన యువతి ఎలాగైనా విమానం ఎక్కాలని నిర్ణయించుకుంది. వెంటనే అధికారుల నుంచి తప్పించుకుని రన్ వే పైకి పరుగుపెట్టింది. ఆమెను గమనించిన అధికారులు వెంటనే యువతిని అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆగకపోవడంతో చేతులకు బేడీలు వేసి ఎయిర్ పోర్టులోకి తీసుకెళ్లారు. చివరికి మరో విమానంలో ఆమెను ఎక్కించి ఊపిరి పీల్చుకున్నారు.