జమ్ముకశ్మీర్ లో చేతులు కలుపుతున్న పీడీపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్
- కొత్త సంకీర్ణానికి ప్రయత్నాలు
- ఏకమవుతున్న వ్యతిరేక పక్షాలు
- 2002 నుంచి 2007 వరకు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన మూడు పార్టీలు
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీడీఎఫ్ తో కలసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఇరు పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతో... జూన్ 16న సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చింది. దీంతో, ముఫ్తీ ప్రభుత్వం అధికారానికి దూరమైంది. గతంలో 2002 నుంచి 2007 వరకు పీడీపీ, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగింది. అప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ ఈ కూటమికి బయట నుంచి మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో, పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ ల కూటమి ఏర్పాటు కష్టతరమైనది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.