పాన్ కార్డు దరఖాస్తుకు ఇకపై తండ్రి పేరు తప్పనిసరి కాదు!
- నిబంధనలను సడలించిన సీబీడీటీ
- తండ్రి మరణించినా, తల్లికి దూరంగా ఉన్నా వర్తింపు
- డిసెంబర్ 5 నుంచి అమలులోకి
తాజా ఆదేశాల మేరకు మరణించిన లేదా తల్లిని వదిలి దూరంగా ఉన్న తండ్రి పేరును దరఖాస్తులో తెలియపరచాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు సీబీడీటీ ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిసెంబర్ 5 నుంచి తాజా మార్పులు అమలులోకి వస్తాయని తెలిపింది.