నా భర్త వద్దంటే సినిమాలు మానేశాను ..హఠాత్తుగా ఆయన చనిపోయాడు: సీనియర్ నటి కృష్ణవేణి

  • దర్శకుడు రాజాచంద్రతో నా పెళ్లి జరిగింది 
  • అది ఆయనకి రెండవ పెళ్లి 
  • పెళ్లి తరువాత నటన మానేశాను  
తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన కృష్ణవేణి, ఆ తరువాత అనేక చిత్రాల్లో హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. " కెరియర్ ఆరంభంలో నేను వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాను. ఆ సమయంలోనే దర్శకుడు 'రాజాచంద్ర'తో నా వివాహం జరిగింది.

'వారాలబ్బాయి'.. 'పిచ్చిపంతులు' .. 'ఓ తండ్రి తీర్పు'.. 'విజృంభణ'.. 'జీవన పోరాటం' సినిమాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ఆయనకి అంతకు ముందే పెళ్లి అయింది .. పిల్లలు కూడా వున్నారు. దర్శకుడిగా ఆయన బిజీగా ఉండటం వలన, నేను ఇంటిపట్టునే వుండిపోయాను. అయితే ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఆ సమయంలో నేను కూడా చనిపోదామనే అనుకున్నాను. కానీ అప్పటికే నాకో కూతురు .. దాని కోసం బతకాలని అంతా నన్ను ఓదార్చారు" అని చెప్పుకొచ్చారు.       
Go Back to Shorts
krishnaveni
ali

More Telugu News