టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.. ముఠా గోపాల్ కు ముషీరాబాద్, మల్లయ్య యాదవ్ కు కోదాడ
- మిగిలిన రెండు సీట్లకు అభ్యర్థుల ప్రకటన
- రేపు నామినేషన్ వేయనున్న గోపాల్, మల్లయ్యలు
- ఫలించని మంత్రి నాయిని ప్రయత్నాలు
కాగా, ముషీరాబాద్ నియోజకవర్గం టికెట్ ను తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఇప్పించుకునేందుకు మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ టికెట్ కేటాయింపు విషయమై చివరి క్షణం వరకూ నాయిని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇక మల్లయ్య యాదవ్ గురించి చెప్పాలంటే, కోదాడ టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన రెండు రోజుల క్రితమే టీఆర్ఎస్ లో చేరారు.