మొబైల్ నంబర్ లేకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ బంద్.. ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక!
- ఈ నెల 30లోగా రిజిస్టర్ చేసుకోండి
- లేదంటే ఈ-బ్యాంకింగ్ ఆపేస్తామని వెల్లడి
- మోసాలను అరికట్టేందుకేనని వివరణ
కొత్తగా తెచ్చిన ఈ సంస్కరణలు డిసెంబర్ 1 నుంచి అమలు అవుతాయని ఎస్బీఐ తెలిపింది. కస్టమర్లు తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సైబర్ నేరాలను దీనిద్వారా అరికట్టవచ్చన్నారు. బ్యాంకు బ్రాంచ్ లేదా ఏటీఎం కేంద్రాల ద్వారా ఖాతాదారులు మొబైల్ నంబర్ ను రిజిస్టర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.