Agnes Hamilton: డ్యాన్స్ పేరిట వెళ్లి వ్యభిచారం... కెన్యాలో పట్టుబడ్డ డ్యాన్సర్.. బాలీవుడ్ నృత్య దర్శకురాలి ఆధ్వర్యం!

  • నృత్య ప్రదర్శనల పేరిట విదేశాలకు
  • అక్కడ వ్యభిచారం చేయాలని ఒత్తిడి
  • కెన్యాలో బట్టబయలైన దందా
నృత్య ప్రదర్శనల పేరిట అమ్మాయిలను విదేశాలకు తీసుకెళ్లి, అక్కడ వారితో వ్యభిచారం చేయిస్తున్న బాలీవుడ్ నృత్య దర్శకురాలి దందాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. అంధేరీలోని లోఖండ్ వాలా సమీపంలో బాలీవుడ్ హబ్ పేరిట నృత్య శిక్షణా తరగతులను నిర్వహించే అగ్నేస్ హమిల్టన్, పలు బాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. మలేషియా తదితర దేశాల మధ్య  తరచూ తిరుగుతున్న ఈమె, ఇక్కడి నుంచి అమ్మాయిలను విదేశాలకు పంపుతోంది.

 ఇటీవల కెన్యాలోని ఓ హోటల్ లో నృత్య ప్రదర్శనకు వచ్చిన యువతి వ్యభిచారం చేస్తుంటే, పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడంతో ఆగ్నెేస్ పేరు బయటకు వచ్చింది. నైరోబీకి తనను పంపించిన వారు వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశారని ఆమె చెప్పింది. ఒక్కొక్కరి నుంచి రూ. 40 వేలు తీసుకుంటున్న అగ్నెస్, వారిని కెన్యా, బహ్రెయిన్, దుబాయ్ తదితర దేశాలకు పంపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

వారిచ్చిన సమాచారం మేరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ అగ్నేస్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించింది. కాగా, అగ్నేస్ ఫేస్ బుక్ పేజీలో బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ తో దిగిన ఫోటోలు కనిపించడం గమనార్హం.
Agnes Hamilton
Bollywood
Foreign
Prostitution
S*x Rocket
Arrest
Mumbai

More Telugu News