20 మందికి టికెట్లు కేటాయిస్తూ బీజేపీ మూడో జాబితా విడుదల
- జాబితా విడుదల చెసిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి నడ్డా
- గడచిన రెండు జాబితాల్లో 66 మందికి అవకాశం
- తాజా జాబితాతో మొత్తం 86 మందికి టికెట్లు... 33 స్థానాలు పెండింగ్
తాజా జాబితాలో సీటు దక్కించుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి- లక్ష్మారెడ్డి, వేములవాడ- ప్రతాపకృష్ణ, హుజూరాబాద్- పుప్పలరఘు, హుస్నాబాద్- చాడ శ్రీనివాస్‌రెడ్డి, మెదక్- ఆకుల రాజయ్య, నారాయణ్‌ఖేడ్- జీ రవికుమార్‌గౌడ్, సంగారెడ్డి- బీ రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, పటాన్‌చెరు- పి.కరుణాకర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం- కోత అశోక్‌గౌడ్, చేవెళ్ల(ఎస్సీ)- కంజర్లప్రకాశ్, నాంపల్లి- దేవర కరుణాకర్, సికింద్రాబాద్- సతీశ్‌గౌడ్, కొడంగల్- నాగూరావ్ నామాజీ, మహబూబ్‌నగర్- జి.పద్మజారెడ్డి, ఆలంపూర్(ఎస్సీ)- రజనీ మాధవరెడ్డి, నల్లగొండ- శ్రీరామోజు షణ్ముఖ, నకిరేకల్(ఎస్సీ)- కాసర్ల లింగయ్య, మహబూబాబాద్(ఎస్టీ)- జ్యోతుల హుస్సేన్‌నాయక్, ఖమ్మం- డాక్టర్ ఉప్పల శారద, మధిర- డాక్టర్ శ్యామలరావు ఉన్నారు.