పొన్నాలకు సీటు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చిన రాహుల్!
- సీటు దక్కించుకోలేకపోయిన పొన్నాల, పొంగులేటి
- రాహుల్‌కి సమస్యను వివరించిన నేతలు
- తనకు వదిలేయాలని రాహుల్ సూచన
తాను 35 ఏళ్లుగా జనగామకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని.. పొత్తుల కారణంగా తాను సీటు కోల్పోయానని రాహుల్‌కు పొన్నాల వివరించారు. జనగామకు సంబంధించి అన్ని విషయాలను కుంతియాకు వివరించాలని సూచించారు. జనగామ సమస్యను పరిష్కరించి పొన్నాలకు సీటు దక్కేలా చూస్తానని రాహుల్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోపక్క, పొత్తుల్లో భాగంగా జనగామ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది.