‘కాంగ్రెస్’ జెండా దిమ్మె ధ్వంసం.. టీడీపీకి ఎవరితో ఓట్లేసి గెలిపిస్తారో గెలిపించుకోండి: కార్తీక్ రెడ్డి
- కార్తీక్ రెడ్డి అనుచరుల హంగామా
- శంషాబాద్ లోని ‘కాంగ్రెస్’ దిమ్మె పగలగొట్టిన వైనం
- ఈ నెల 19 లోపు నాకు బీఫాం ఇవ్వాలి
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులకు తాము చెప్పాల్సినదంతా చెప్పామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు బీఫాం ఇస్తే రాజీనామాను ఆమోదించనట్టని, ఒకవేళ బీఫాం ఇవ్వకపోతే రాజీనామాను అంగీకరించినట్టని అన్నారు. ఈ నెల 19వ తేదీ లోపు తనకు బీఫాం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎవరితో ఓట్లేసి గెలిపించుకుంటారో గెలిపించుకోండంటూ సవాల్ విసిరారు.