తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతున్న సినీ హాస్య నటుడు వేణుమాధవ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతున్న సినీ హాస్య నటుడు వేణుమాధవ్!

  • కోదాడ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న వేణుమాధవ్
  • వేణుమాధవ్ స్వస్థలం కోదాడ
  • ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వస్తున్నానన్న వేణు
సినీ నటుడు వేణుమాధవ్ తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు తెలిపాడు. ఈరోజు ఆయన నామినేషన్ వేయబోతున్నారు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ పట్టణమే. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మిమిక్రి ఆర్టిస్ట్ గా ఆయన జీవితాన్ని ప్రారంభించారు. టీడీపీ సభల్లో మిమిక్రీ ద్వారా ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత సినిమాలలో ఛాన్సులు రావడంతో... నటుడిగా బిజీ అయిపోయారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ, తన నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవ చేయడానికే క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. 
venumadhav
tollywood
Telangana
elections
independent
contest
kodada

More Telugu News