రేపు చలామణిలోకి రానున్న రూ. 12 వేల కోట్ల నగదు!
- ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య కొరత
- రంగంలోకి దిగిన ఆర్బీఐ
- ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్న రిజర్వ్ బ్యాంక్
ఆర్థిక సేవల సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, గడచిన సెప్టెంబర్ నెలలో డిఫాల్ట్ గా మారడంతో, ఎకానమీలో ద్రవ్య కొరత ఏర్పడిన కారణంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా రూ. 12 వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నామని, మల్టిపుల్ సెక్యూరిటీ ఆక్షన్ విధానంలో కొనుగోలు ఉంటుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.