Telangana: కేసీఆర్, హరీశ్ రావు సహా పలువురిపై కేసుల ఎత్తివేత!

తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న వేళ, అప్పటి నిరసనకారులైన ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌, ఇతర నేతలు హరీశ్ రావు, కోదండరామ్ సహా పలువురిపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తున్నట్టు న్యాయ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల అయ్యాయి.

వీరిపై వికారాబాద్‌, నిజామాబాద్‌ రైల్వే పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయన్న సంగతి తెలిసిందే. ఈ కేసులపై నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖను కోరిన న్యాయ శాఖ, రిపోర్టు ఆధారంగా కేసులను ఎత్తివేస్తున్నట్టు పేర్కొంది. కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి  తదితరులపై నమోదైన కేసుల్ని కూడా ప్రభుత్వం తొలగించింది. ఉద్యమ సమయంలో రైళ్లను అడ్డుకున్నారని, అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయి.
Telangana
Agitation
KCR
Harish Rao
Police
KTR

More Telugu News