పొత్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆవేదన
- సిట్టింగ్ స్థానాలు అడగటం అన్యాయం
- పార్టీనే నమ్ముకున్న వారికి న్యాయం చేయాలి
- సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడం దారుణం
నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ పాలన పేరుతో కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తున్న నేతలే తమ కుటుంబీకులకు సీట్లు అడగటం శోచనీయమన్నారు. ప్యారాచూట్ నేతలు, కాంట్రాక్టర్లకు సీట్ల కేటాయింపు విషయంలో రాహుల్ సరైన నిర్ణయం తీసుకుంటారని పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు. పొన్నాల వంటి సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడం దారుణమని.. పార్టీనే నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని కోరారు.