టీఆర్ఎస్ భవన్ వద్ద మన్నె గోవర్ధన్ రెడ్డి అనుచరుల ఆందోళన
- ఖైరతాబాద్ టీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర పోటీ
- టికెట్ ఆశిస్తున్న దానం, మన్నె, విజయారెడ్డి
- టికెట్ మాకే ఇవ్వాలంటూ మన్నె అనుచరుల ఆందోళన
ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ కు టీఆర్ఎస్ టికెట్ దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో, దానంకు టికెట్ ఇవ్వరాదని మన్నె అనుచరులు డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ టీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. దానం నాగేందర్, మన్నె గోవర్దన్ రెడ్డిలతో పాటు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిలు టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే, కేసీఆర్ దానంవైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.