చత్తిస్గఢ్లో ఎదురు కాల్పులు.. ఎన్నికలకు ఒక రోజు ముందు కలకలం!
- ఒక మావోయిస్టు హతం...పోలీసుల అదుపులో మరొకరు
- రెండు రైఫిళ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం
- బీజాపూర్ జిల్లా బెడ్రే ప్రాంతంలో ఘటన
మరికొందరు మావోయిస్టులు పరారు కావడంతో వారిని పట్టుకునేందుకు అదనపు సిబ్బందిని రప్పిస్తున్నారు. ఘటనా స్థలి నుంచి రెండు రైఫిళ్లు, మరికొన్ని ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కాంకేర్ జిల్లా కొయిబెడే ప్రాంతంలో జరిగిన ఐఈడీ పేలుడులో ఓ బీఎస్ఎఫ్ జవాను గాయపడ్డాడు. ఈ పేలుడు అనంతరం మావోయిస్టులు కాల్పులు జరపడంతో బీఎస్ఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు.