మంత్రి పదవిపై నాకు ఎలాంటి సమాచారం లేదు: కిడారి కుమారుడు శ్రవణ్
- రేపే ఏపీ కేబినెట్ విస్తరణ
- ఫరూక్, కిడారి శ్రవణ్ లకు స్థానం
- చంద్రబాబుతో చర్చించిన తర్వాత స్పందిస్తానన్న శ్రవణ్
ఓ న్యూస్ ఛానల్ తో శ్రవణ్ మాట్లాడుతూ, మంత్రి పదవిపై తనకు ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాతే ఈ విషయంపై స్పందిస్తానని తెలిపారు. మరోవైపు, శ్రవణ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నారన్న వార్తలపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.